November 14, 2026
Explore
రైలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ అలర్ట్.. 14 ఫుడ్ యాప్స్‌పై నిషేధం

రైలు ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ అలర్ట్.. 14 ఫుడ్ యాప్స్‌పై నిషేధం

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రైల్వే ప్రయాణికుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎటువంటి అనుమతులు లేకుండా ఆహారాన్ని సరఫరా చేస్తున్న 14 అనధికారిక ఫుడ్ డెలివరీ వెబ్‌సైట్లు, యాప్స్‌ను నిషేధించింది.

ఈ సంస్థల ద్వారా వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యే ప్రమాదం ఉందని, నాణ్యత లేని ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించింది.

ప్రయాణికులు కేవలం జొమాటో, స్విగ్గీ వంటి అధికారిక సంస్థల నుంచే ఆర్డర్ చేసుకోవాలని, అనుమానాస్పద యాప్స్‌కు దూరంగా ఉండాలని సూచించింది.

Tags: IRCTC alert for train passengers: 14 food apps banned