పుంగనూరు
పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఆదివారం లయన్స్ క్లబ్ , లియోక్లబ్ చే కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కంటి జబ్బులు కలిగిన వారికి ఉచితంగా చికిత్సలు నిర్వహించి, ఆపరేషన్లకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు ఆరోగ్యశ్రీకార్డు, ఆధార్‌కార్డు , సెల్ నెంబరు వెంట తీసుకొచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
Tags; Eye camp on the 15th