- న్యాయమూర్తి పరేష్‌కుమార్
పుంగనూరు ముచ్చట్లు:
విద్యార్థులు చట్టాలపై అవగాహన క లిగి , భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం కావాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పరేష్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని కొత్తయిండ్లు మున్సిపల్ హైస్కూల్‌లో బాలల దినోత్సవం సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయమూర్తి పరేష్‌కుమార్ మాట్లాడుతూ సోషల్‌మీడియా, చెడు అలవాట్లకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. విద్యార్థులు చట్టాలపైన , సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకుని, క్రమశిక్షణతో విద్యావంతులుకావాలన్నారు. క్రమశిక్షణ లేని విద్యకు గుర్తింపు ఉండదన్నారు. ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదివి, సమాజానికి సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్, సీఐ సుబ్బరాయుడు,ఎంఈవో నటరాజారెడ్డి, న్యాయవాదులు వెంకట్రమణ, శ్రీనివాసులు, ఉపాధ్యాయుడు శ్రీరాములురెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: Students should have an understanding of the laws.