November 14, 2026
Explore
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు.. త్వరలో స్పెషల్ సెషన్స్!

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కసరత్తు.. త్వరలో స్పెషల్ సెషన్స్!

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కేంద్రం దృష్టి సారించింది. పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్లు, లోక్సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచే లక్ష్యంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే మెజారిటీ సాధించే విషయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. 361 ఓట్ల కన్నా 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ సమావేశాలు ఎప్పుడు ఉంటాయనే దానిపై స్పష్టత లేదు.

Tags; Centre working on Women’s Reservation Bill.. special sessions likely soon!