November 14, 2026
Explore
నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్

నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సచివాలయాలు, ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా సేవలు

దివ్యాంగులు సదరం ధ్రువపత్రాలు పొందేందుకు ముందస్తు స్లాట్ నమోదుకు నేటి నుంచి ప్రభుత్వం అవకాశం కల్పించింది. గ్రామ, వార్డు కార్యాలయాలు, ‘మన మిత్ర’’ వాట్సాప్, ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 21 కేటగిరీల్లో వైకల్యాలకు వేర్వేరుగా స్లాట్లు కేటాయించనున్నారు. యాసిడ్ దాడి, అభ్యాస వైకల్యం, ఆటిజం, బహుళ వైకల్యం వంటి కొత్త కేటగిరీలకు వేర్వేరుగా స్లాట్లు నమోదు చేసుకోవాలి. స్లాట్ నమోదుకు వెళ్లేవారు ఆధార్ కార్డుతో పాటు దానికి అనుసంధానమైన ఫోన్ నంబర్ కూడా వెంట తీసుకెళ్లాలి.

మన మిత్ర వాట్సాప్ నంబరు 9552300009

Tags: Sadaram slot booking starts today