మదనపల్లిముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్‌లో శనివారం ఉదయం తేనెటీగలు పర్యాటకులపై దాడి చేశాయి. ఘాట్ రోడ్డులో ప్రకృతి అందాలు తిలకిస్తున్న చిత్తూరుకు చెందిన పావని(32), నీరజ్(31) వదిథి(14), గురుప్రియ(20), మనోజ్(34), సౌహిత్(18), చరిస్మా(23) సహా ఏడుగురు గాయపడ్డారు. వెంటనే వారిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఎవరికీ ప్రాణా పాయంలేదని వైద్యులు తెలిపారు. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Tags; Bees attack tourists at Horsley Hills