November 14, 2026
Explore
సీసీటీవీ నిఘాతో 40 గ్రాముల బంగారు కడియం గుర్తింపు

సీసీటీవీ నిఘాతో 40 గ్రాముల బంగారు కడియం గుర్తింపు

November 14, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

– భక్తురాలికి సురక్షితంగా అప్పగింత

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీపాద రాజ శృతి ప్రసాదం పంపిణీ కేంద్రం సమీపంలోని తాగునీటి పాయింట్ వద్ద అనుకోకుండా పోగొట్టుకున్న సుమారు 40 గ్రాముల బంగారు కడియాన్ని శుక్రవారం పోగొట్టుకున్నారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి, తిరిగి ఆమెకు అందజేశారు.

భక్తురాలి చేతి నుంచి కడియం జారిపడిన విషయాన్ని వెనుక ఉన్న కొంతమంది భక్తులు గుర్తించి తీసుకున్నారు. ఈ ఘటనను కమాండ్ కంట్రోల్ సిబ్బంది సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు.

టీటీడీ సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ ఆదేశాల మేరకు, విజిలెన్స్ అధికారి (వీజీఓ) సురేంద్ర పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ ఏవీఎస్వో వెంకటరమణ, సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి కడియాన్ని గుర్తించారు. అనంతరం అసలు యజమానురాలైన భక్తురాలికి అప్పగించినట్లు ఏవీఎస్వో వెంకటరమణ తెలిపారు.

తన విలువైన బంగారు కడియం తిరిగి లభించడంతో భక్తురాలు ఆనందం వ్యక్తం చేస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:40-gram gold bangle identified via CCTV surveillance