November 14, 2026
Explore
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బంపర్ ఆఫర్లతో అభ్యర్థులు.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బంపర్ ఆఫర్లతో అభ్యర్థులు.

November 14, 2026 | Andhra Pradesh

పశ్చిమగోదావరిముచ్చట్లు:

ఏకగ్రీవంగా ఎన్నిక అయితే కోట్లల్లో పంచాయితీ కి ఇస్తామంటున్న అభ్యర్థులు…

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రెండెకరాల పొలం…ఎకరం కోటి పై మాటే….

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో ఆసక్తికర ప్రకటన వెలువడింది.

గ్రామస్థులంతా కలిసి తన భార్య రామలక్ష్మిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పంచాయతీకి రెండెకరాల పొలం రాసిస్తానని గ్రామ ప్రముఖుడు కొప్పర్తి శ్రీరామ్మూర్తి ప్రకటించారు.

గ్రామంలో తాగునీటి చెరువు సమస్యను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే గ్రామ పెద్దలు, ప్రజలతో సమావేశమై తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు శ్రీరామ్మూర్తి దంపతులు పేర్కొన్నారు.

Tags; Candidates in Gram Panchayat elections offer ‘bumper deals’.