కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
- ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 98 ఫిర్యాదులు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.
కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 98 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) హైదరాబాద్ లో ఈదర వెంకట రమేష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్నాడు, నేను శేఖర్ డాన్స్ మాస్టర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నపుడు పరిచయం అయ్యాడు . పలు టీవీ లలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.11 లక్షల 13 వేలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు, వెంకటరమణ కాలనీకి చెందిన లోకేష్ ఫిర్యాదు చేశారు.
2) ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులలో ఒక అటెండర్ పోస్టు ఖాళీ గా ఉందని, ఆ ఒక్క ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో పనిచేసే ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారి రూ. 3 లక్షలు తీసుకొని మోసం చేశాడని కర్నూల్, గౌలీగేరి కి చెందిన అర్జున్ ఫిర్యాదు చేశారు.
3) ప్రభుత్వ పాఠశాలలలో విద్యాంజలి పథకం కింద కాంట్రాక్టు బేసిక్ ప్రకారము కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగo ఇప్పిస్తానని చెప్పి గూడూరుకు చెందిన కరుణాకర్ రూ.3 లక్షలు తీసుకొని ఒక నెలలో జాయినింగ్ లెటర్ వస్తుందని చెప్పి మోసం చేశాడని కర్నూలు, ముజఫర్ నగర్ కు చెందిన శివకుమార్ ఫిర్యాదు చేశారు.
4) కర్నూల్ ఆగ్రో స్కై కంపెనీకి చెందిన ఒక వ్యక్తి రూ. 5 లక్షల 95 వేలకు అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ ఇప్పిస్తామని , ఉపాధి , శిక్షణ కూడా ఇప్పిస్తామని, నెలకు లక్ష దాకా ఆదాయం వస్తుందని మోసపూరిత మాటలు చెప్పి ఫేక్ డ్రోన్ ప్రోడక్ట్ ఇచ్చి మోసం చేశాడని కర్నూలు, రేమట చెందిన కు ప్రభాకర్ శెట్టి ఫిర్యాదు చేశారు.
5) మిర్చి పంటను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని కల్లూరు మండలం కు చెందిన హుస్సేన్ ఫిర్యాదు చేశారు.
6) నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, నా భర్త గుండెపోటుతో చనిపోతే వచ్చిన (ఇన్సూరెన్స్) భీమా డబ్బులు ఇవ్వకుండా నా మరిది , అత్త కలిసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని న్యాయం చేయాలని ఆలూరుకు చెందిన సుగుణ ఫిర్యాదు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు.
ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా , సిఐలు శివ శంకర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
Tags: We will conduct an inquiry and ensure justice in accordance with the law.