November 14, 2026
Explore
తమిళనాడులోని కోవిల్పట్టిలో వృద్ధాప్యంతో మృతి

తమిళనాడులోని కోవిల్పట్టిలో వృద్ధాప్యంతో మృతి

November 14, 2026 | Andhra Pradesh

తమిళనాడుముచ్చట్లు:

శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమల తిరుపతి స్వామి వారి రూపంగా కొలుస్తున్న తిరుమల వేంకటేశుడికి రూపమిచ్చిన చిత్రకారుడు శ్రీనివాసన్ కన్నుమూత

1970లో టీటీడీ ఆహ్వానంతో గర్భగుడిలో స్వామిని చూసి చిత్రాలు గీసిన శ్రీనివాసన్

ఆభరణాలతో, ఆభరణాలు లేకుండా రెండు రూపాల్లో చిత్రాలు

ఇంటింటా పూజలందుకుంటున్న ఆయన చిత్రాలు

తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్, పదో తరగతి వరకు చదివి ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు వద్ద చిత్రకళలో శిక్షణ పొందారు. ఆయన ప్రతిభను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 1970లో ప్రత్యేకంగా ఆయనను ఆహ్వానించింది. గర్భగుడిలోని మూలవిరాట్టును నేరుగా దర్శించి, స్వామివారి దివ్య రూపాన్ని ఆయన తన కుంచెతో చిత్రించారు.

స్వామివారు సర్వాభరణాలతో అలంకరించుకున్న రూపం ఒకటి, ఆభరణాలు లేకుండా ఉన్న నిరాడంబర రూపం మరొకటి.. ఇలా రెండు రకాల అద్భుతమైన చిత్రాలను ఆయన గీశారు. ఈ చిత్రాలు అనతికాలంలోనే భక్తుల్లో అశేష ప్రాచుర్యం పొందాయి. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి ఇంట్లో, వ్యాపార సంస్థలో కనిపించే శ్రీవారి చిత్రం శ్రీనివాసన్ గీసిందే. వేంకటేశ్వరస్వామితో పాటు ఆయన పలు ఇతర హిందూ దేవతామూర్తుల చిత్రాలను కూడా గీసి మెప్పించారు.

కోవిల్పట్టిలోని మండిత్తోప్పు రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో మరణవార్త తెలియగానే, పలువురు ప్రముఖులు, స్థానికులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. శ్రీవారి రూపానికి తన కుంచెతో శాశ్వతత్వాన్ని అందించిన శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags: Died of old age in Kovilpatti, Tamil Nadu