ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు
సుండుపల్లి ముచ్చట్లు:
సుండుపల్లి మండలంలో రేపటి నుంచి 15, 16, 17 తేదీల్లో జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ సురేష్ రెడ్డి, ఎస్ఐ అమర్నాథరెడ్డి కోరారు.శుక్రవారం సుండుపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలు, డీఎస్పీ వెంకటరామయ్య సూచనల మేరకు నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నామినేషన్ల కేంద్రాల వద్దకు అనవసరంగా కొత్త వ్యక్తులు రావద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండలంలోని 18 గ్రామాల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించాలని కోరారు.
Tags: Criminal cases will be registered if nominations are obstructed.