November 13, 2026
Explore
21న చెక్‌బౌన్సుల లోక్‌అదాలత్‌

21న చెక్‌బౌన్సుల లోక్‌అదాలత్‌

November 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కోర్టు ఆవరణంలో ఈనెల 21న చెక్‌బౌన్సు కేసులకు సంబంధించి పరిష్కరించే లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆరీఫాషేక్‌ తెలిపారు. శుక్రవారం ఆమె ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చెక్కు కేసులకు సంబంధించిన అన్నిశాఖలకు సంబంధించి ఈనెల 16న కోర్టులో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. లోక్‌అదాలత్‌లో అత్యధికంగా చెక్కు కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు, కక్షిదారులు, వివిధశాఖల అధికారులు కృషి చేయాలని ఆమె కోరారు.

Tags; Lok Adalat for cheque bounce cases on the 21st