పుంగనూరు ముచ్చట్లు:
దోమల నివారణతో వ్యాధులు వ్యాపించవని, అది మన చేతుల్లోనే ఉందని వైద్యశాఖ సబ్‌యూనిట్ అధికారి గంగయ్య తెలిపారు. శుక్రవారం జాతీయ కీటక జనిత వ్యాధుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని నక్కబండ ప్రాంతంలో ఫీవర్‌సర్వే, లార్వాసర్వే నిర్వహించారు. దోమలు ద్వారా వ్యాపించే వ్యాదులు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో వైద్యసిబ్బంది సోమశేఖర్ ఆచారి, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
Tags: Creating public awareness about mosquito control