నరసరావుపేటముచ్చట్లు:
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు.
వార్డుల పునర్విభజన అనంతరం నరసరావుపేటలో 48 వార్డులు ఏర్పాటు చేశారు. 42 ప్రాంతాల్లో 116 పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేశారు.
ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, 14 నుంచి 16 వరకు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం 12 కౌంటర్లతో పాటు చైర్మన్ అభ్యర్థికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.
Tags: Everything is set for the municipal elections—48 wards, 116 polling stations!