అమరావతిముచ్చట్లు:
సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ప్రచారంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ..
సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ప్రచారంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి చెబుతున్న అభివృద్ధి గణాంకాలకు, రాష్ట్రంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని ఆయన తన ఎక్స్ వేదికగా ఆరోపించారు.
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తోందని జగన్ మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని జగన్ విమర్శించారు.
క్షేత్రస్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయని, కేవలం అంకెల గారడీతో అభివృద్ధి జరుగుతున్నట్లు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కేవలం ప్రచార ఆర్భాటాలతో వాస్తవాలను దాచలేరని జగన్ పేర్కొన్నారు..
Tags: Jagan Mohan Reddy’s criticisms regarding the development claims being promoted by Chandrababu