మదనపల్లెముచ్చట్లు:
2026 పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాన్ని పెంచినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే జనాభా ప్రాతిపదికన నగదు ఇస్తారు. 5 వేల వరకు జనాభాకు రూ.15 లక్షలు, 5,001-10 వేలకు రూ.25 లక్షలు, 10 వేలు పైబడితే రూ.50 లక్షలు. ఏకగ్రీవం పూర్తిగా స్వచ్ఛందంగా జరగాలని, బలవంతం, ఒత్తిడి, ప్రలోభాలకు తావుండకూడదని స్పష్టం చేశారు.
Tags;Incentive ranging from Rs. 15 lakh to Rs. 50 lakh for unanimously elected panchayats