అమరావతిముచ్చట్లు:
మంత్రి నారా లోకేశ్ పని తీరుపై అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ప్రశంసలు కురిపించారు.
నారా లోకేశ్ ని.ఆమె ఒక ‘రాక్టార్ మినిస్టర్’గా అభివర్ణించారు. రాష్ట్రంతో పాటు దేశ ప్రగతి కోసం ఆయన అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.
లోకేశ్ నేటి యువతకు నిజమైన ప్రతినిధి అని, ఆయనలో ఉన్న ఉత్సాహం, చురుకుదనం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఉపాసన అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంలో మంత్రి చూపిస్తున్న చొరవను ఉపాసన కొణిదెల ప్రత్యేకంగా అభినందించారు.
కేవలం 16 నెలల స్వల్ప కాలవ్యవధిలోనే రాష్ట్రానికి ఏకంగా 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకురావడం అద్భుతమైన విజయమని ఆమె పేర్కొన్నారు.
ఈ భారీ పెట్టుబడుల రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉపాసన ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags;Upasana showered praise on Minister Nara Lokesh’s performance.