November 13, 2026
Explore
సజ్జనార్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..

సజ్జనార్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..

November 13, 2026 | Andhra Pradesh


యూనిఫామ్‌లో ఉన్న క్రిమినల్.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు..!

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను బదిలీ చేయడంపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ బదిలీ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సజ్జనార్‌ను ఉద్దేశించి ‘యూనిఫామ్‌లో ఉన్న క్రిమినల్’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ సహోద్యోగిపై ఆరోపణలు చేయడం బాధ కలిగిస్తున్నప్పటికీ, ఇదే వాస్తవమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేవలం బదిలీ చేయడం శిక్ష విధించినట్లు కాదని, బదిలీతో నేర స్వభావం పోదని వ్యాఖ్యానించారు. సజ్జనార్‌పై వచ్చిన ఆరోపణలు, ఆయన చేసినట్లు పేర్కొన్న చర్యలపై సమగ్ర విచారణ జరిపి, తప్పు నిర్ధారణ అయితే చట్టప్రకారం శిక్షించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.కాగా, తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి తప్పించి ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ విభాగం డీజీగా నియమించింది. ఆయన స్థానంలో మహేశ్ భగవత్‌ను హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా నియమించింది.నాగేశ్వరరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పోలీసు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Tags: Sensational allegations against Sajjanar by former CBI Director..