మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె వద్ద ఐషర్ లారీ ఢీకొనడంతో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాదకర ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. పాండిచ్చేరి విలియనూర్‌కు చెందిన కార్తీక్ (33) బొలెరోలో మదనపల్లి మీదుగా బెంగళూరుకు వెళ్లే క్రమంలో చీకలబైలు సమీపంలోని బార్లపల్లె వద్ద మినీ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్తీక్ అక్కడేకక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో వెళ్లి జేసీబీ సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:Bolero driver killed after being hit by Eicher lorry