మదనపల్లె ముచ్చట్లు:
ప్రైవేట్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి కుటుంబీకులు, తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. మదనపల్లె టౌన్, నిమ్మనపల్లి రోడ్డు లోని బసినికొండలో నివసిస్తున్న హనుమంతు కొడుకు రామాంజులు(45) భవన కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కర్ణాటక రాయల్పాడులో ఉన్న కుమార్తెను చూడడానికి బైక్‌పై వెళ్తుండగా చీకబైలు, బార్లపల్లె వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితుడుని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు.
Tags: Construction worker sustains severe injuries after being hit by a private bus