తెలంగాణముచ్చట్లు:
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు చలి తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గురువారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 11.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యల్పంగా నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజేంద్రనగర్‌లో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. చలి ప్రభావంతో ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Tags:Severe cold wave to continue for two more days in Telangana