November 13, 2026
Explore
జొన్నలగడ్డ సర్పంచ్ పదవికి రూ.81 లక్షల వేలంపాట.

జొన్నలగడ్డ సర్పంచ్ పదవికి రూ.81 లక్షల వేలంపాట.

November 13, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో సర్పంచ్ పదవి వేలంపాట రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించినట్లు సమాచారం. సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ముగ్గురు టీడీపీ నేతలు వేలంపాటలో పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కొరిటాల గోపాలరావు రూ.77 లక్షల వరకు వేలం పాడగా, చివరకు టీడీపీ నేత యర్రా శ్రీనివాసరావు రూ.81 లక్షలకు వేలంపాటలో సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు తెలిసింది. ముగ్గురు గ్రామస్తుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో వేలంపాట ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు యర్రా శ్రీనివాసరావును సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలపాలని గ్రామ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.

Tags:Sarpanch post in Jonnalagadda auctioned for Rs 81 lakh.