November 13, 2026
Explore
ఒబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ఏర్పాటు!

ఒబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ఏర్పాటు!

November 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో అమరావతిలో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ఏర్పాటుకు సంబంధించి APCRDA, ఈఐహెచ్ లిమిటెడ్ (ఒబెరాయ్ హోటల్స్) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

ఈ ప్రాజెక్టు ద్వారా రూ.174 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. యువతకు 150 ప్రత్యక్ష ఉద్యోగాలు, మరో 250 పరోక్ష ఉద్యోగ అవకాశాలు అమరావతిలో కలగనున్నాయి.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ ఒప్పందాన్ని APCRDA కమిషనర్ వి. విజయ రామరాజు ఐఏఎస్ గారు, ఈఐహెచ్ లిమిటెడ్ ప్రతినిధులు పరస్పరం మార్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, పొంగూరు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఐఏఎస్, ఏపీ ఈడీబీ సీఈఓ షాన్ మోహన్ ఐఏఎస్, APCRDA అదనపు కమిషనర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:A five-star luxury hotel to be set up under the Oberoi Group!