హైదరాబాద్ ముచ్చట్లు:
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాధితులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ఊరటనిచ్చే తీపి కబురు అందించిం ది. క్యాన్సర్ చికిత్స లో విస్తృతంగా వినియోగించే 137 రకాల ఔషధాల గరిష్ఠ విక్రయ ధరలను ఏకంగా 96.45 శాతం వరకు తగ్గిస్తున్నట్లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఫార్మా కంపెనీల ట్రేడ్ మార్జిన్లపై పరిమితి విధించిన నేపథ్యం లో ఈ సవరణలు జరిగాయి. నవంబర్ 9వ తేదీ నుంచే అమల్లోకి రానున్న ఈ కొత్త ధరల వల్ల దేశంలో ఏడాదికి ఏకంగా రూ.3,502 కోట్ల మేర బాధితుల కు ఆర్థిక భారం తప్పుతుందని అంచనా వేస్తున్నారు.
ఎన్‌పీపీఏ మార్గ దర్శకాల ప్రకారం ఫార్మా కంపెనీలు సమర్పించిన నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 76 ఫార్మా కంపెనీలు 121 రకాల మందు లకు సంబంధించిన 1,225 ఫార్ములేషన్ల నూతన రేట్లను సమర్పించగా, అందులో 1,031 ఫార్ములేషన్ల ధరలు గణనీయంగా తగ్గాయి.
దేశవ్యాప్తంగా లభించే వివిధ రకాల 600 ప్రాచుర్యం పొందిన బ్రాండ్ల ఔషధాల ధరలు 50 శాతానికి పైగా తగ్గడం విశే షం. భవిష్యత్తులో విదేశాల నుంచి భారత మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించే మరో 10 నుంచి 15 రకాల క్యాన్సర్ మందులకు కూడా ఈ ట్రేడ్ మార్జిన్ పరిమితి నిబంధ నలు వర్తిస్తాయి.
Tags: Reduction in prices of cancer medicines