November 13, 2026
Explore
ఉరి వేసుకుని నవవధువు ఆత్మహత్యాయత్నం

ఉరి వేసుకుని నవవధువు ఆత్మహత్యాయత్నం

November 13, 2026 | Andhra Pradesh

రామసముద్రంముచ్చట్లు:

నవవధువు ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన శుక్రవారం అన్నమయ్య జిల్లాలో జరిగింది. రామసముద్రం మండలం బైరాసుపల్లెకు చెందిన జనకరాజు మూడు నెలల క్రితం మేఘన (20)ను వివాహం చేసుకున్నాడు. భర్త ఆలస్యంగా వస్తున్నాడని, పుట్టినింటికి తీసుకెళ్లాలని మేఘన నిలదీసింది. లోడుకు వెళ్లి వచ్చి వెళ్దామని చెప్పడంతో ఆగ్రహించి ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబీకులు ఆమెను రామసముద్రం పీహెచ్‌సీకి, అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రుయాకు రెఫర్ చేశారు.

Tags; Newlywed woman attempts suicide by hanging