కదిరి ముచ్చట్లు:
మదనపల్లె పట్టణంలోని కదిరి రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చిన్నమ్మ (65) అనే వృద్ధ మహిళ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. స్థానికులు ఆమెను బైకులో జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చి చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఆచూకీ తెలియకపోవడంతో ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. గుర్తుపట్టిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి రావాలని వైద్య సిబ్బంది కోరారు.
Tags: Accident on Kadiri Road: Woman in critical condition