November 13, 2026
Explore
పుంగనూరులో టీడీపీలోకి భారీగా చేరికలు..

పుంగనూరులో టీడీపీలోకి భారీగా చేరికలు..

November 13, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు నాయకత్వానికి ఆకర్షితులై ఫ్రూట్ మర్చంట్ అసోసియేషన్‌కు చెందిన పలువురు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు నాయకత్వం, ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటానికి ఆకర్షితులైన ఫ్రూట్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఫ్రూట్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు చాందు ఆధ్వర్యంలో పర్వేజ్, నౌషాద్,సయ్యద్,నూర్, అబ్దుల్,జబ్బార్,రియాజ్, రఫీక్, బావాజాన్, షావలీ,జాఫర్, మహబుబ్ అలీ, బుడ్డు,అష్రఫ్, అయుబ్, సఇద్,అహ్మద్, విజయ్, ఇర్షాద్, వరాలు, బాబా, సైఫుల్లా, కదిర్, నూరుల్లా,దావుద్, ఫజల్ తదితరులు టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.

Tags:Massive influx into TDP in Punganur..