బెంగళూరు ముచ్చట్లు:
నిత్యం మద్యం తాగి వచ్చి, నువ్వు గొడ్రాలివి అని వేధిస్తున్న భర్త రాజశేఖర్ (32)ని అతని భార్య మాలాశ్రీ (30) చివరికి కడతేర్చింది.
పోలీస్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం..
బెంగళూరు కెంపేగౌడనగర లక్ష్మీపురలో రాజశేఖర్, మాలాశ్రీ దంపతులు ఉండేవారు. ఒక బ్యాంకులో రుణాల మంజూరు విభాగంలో అతను పని చేసేవాడు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలుగలేదు. మద్యం తాగి వచ్చి నిత్యం భార్యతో రాజశేఖర్ గొడవ పడేవాడు. బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇదే క్రమంలో వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి భర్తపై దాడి చేసింది. ఇష్టానుసారం నరికగా.. తీవ్రంగా గాయపడి భర్త మరణించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మాలాశ్రీని అరెస్టు చేసి, విచారణ చేపట్టారు.
Tags; She hacked her husband to death for calling her barren.