November 13, 2026
Explore
ఘనంగా ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు.

ఘనంగా ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు.

November 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలోని రాంనగర్ మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళావతి మాట్లాడుతూ బాలల దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలను, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. సి. హేమలత మాట్లాడుతూ చాచా నెహ్రూకు పిల్లలు,గులాబీ పువ్వులంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఆయన మనస్తత్వాన్ని ప్రతిబింబించే పాటను ఆలపించి వినిపించారు.

ఉపాధ్యాయులు జి. చిన్న రెడ్డెప్ప మాట్లాడుతూ విద్యార్థులు దేశం గర్వించేలా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కె. సతీష్ కుమార్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతాయుతమైన, సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.రామరాజు రెడ్డెప్ప మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్య అనేది విద్యార్థుల జీవితానికి పునాది వంటిదని, పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్ననాటి నుంచే మంచి లక్షణాలను అలవర్చుకొని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు, గొప్పతనం గురించి ప్రసంగించారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు,పాఠశాల సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Tags:Children’s Day celebrations held in a grand manner ahead of the actual date.