: ఎస్పీ జగదీష్ ఆదహళ్లి.
పల్నాడు ముచ్చట్లు:
పల్నాడు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను అత్యంతపారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి స్పష్టం చేశారు.గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఐఏఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ పాల్గొని ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా సమస్యాత్మక మరియు అతి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపట్ల ఏమాత్రంఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా,నిర్భయంగా తమ ఓటు హక్కునుసద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Tags:Everything is set for panchayat elections in Palnadu district