ప్రతి గురువారం మహిళా గ్రీవెన్స్ నిర్వహణ.. అర్జీలపై అధికారులకు ఆదేశాలు
గుంటూరుముచ్చట్లు:
మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి గురువారం మహిళా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గురువారం నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఆర్థిక మోసాలు, రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సమస్యలతో పాటు పోలీస్ కేసులు, విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి అర్జీని సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
Tags; The goal is to resolve women’s issues: MLA Galla Madhavi