కడపముచ్చట్లు:
కడప-కృష్ణాపురం మార్గమధ్యంలోని రైల్వే పట్టాల వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతుడికి సుమారు 50ఏళ్లు ఉంటాయని, నీలం రంగు బనియన్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. మృతదేహంపై స్పష్టమైన గాయాలు కనిపించలేదన్నారు. ఘటనా స్థలంలో ఓ బాటిల్ లభించిందని, మృతికి గల కారణాలపై విచారిస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని కడప రిమ్స్్స్కు తరలించారు.
Tags: Unidentified body found near railway tracks