అమరావతిముచ్చట్లు:
సీఎం చంద్రబాబుపై మండిపడ్డ మాజీ సీఎం వైఎస్ జగన్
ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను తెగనమ్ముతున్నారు
రూ.వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు
సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం..
వీజీఎఫ్ పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ
భూములు ప్రభుత్వానివి.. భవనాలన్నీ ప్రభుత్వ నిధులతోనే..
వీజీఎఫ్ రూపేణా ఇవ్వనున్న డబ్బు కూడా ప్రజాధనమే..
సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే..
మరి ప్రైవేటు సంస్థల పేరిట స్కామ్ కాకపోతే ఇది ఏమిటి?
మేం తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీలన్నీ.. టీచింగ్ ఆస్పత్రులే
పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యంతోపాటు సగం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ
మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటుతో పోలిస్తే అతి తక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి
ఈ కాలేజీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా మేం పటిష్ట మోడల్ రూపొందించాం
అలాంటి ఏర్పాట్లు ఉండగా.. పీపీపీ ముసుగులో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది బాబూ?
ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా.. అన్నారు.
Tags: Babu’s PPP scheme—it’s a blatant scam.