అమరావతిముచ్చట్లు:
చట్టం అమలుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనం నుంచి నిర్దేశిత మొత్తాన్ని తగ్గించి… వారి ఖాతాల్లో జమచేయాలన్న చట్టం అమలుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ప్రతినెలా ఉద్యోగి మొత్తం వేతనంలో 15% లేదా రూ. 10 వేలు ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల సహాయ పర్యవేక్షణ చట్టం-2026’ను ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా దీని అమలుకు వయోవృద్ధుల సంక్షేమశాఖ నిబంధనలు రూపొందించి… ఆమోదానికి ప్రభుత్వానికి పంపించింది. కొత్త చట్టం కింద ఇప్పటికే రాష్ట్రంలో ఐదు ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.
Tags: Stage set for a ‘Rs 10,000 deduction’ if parents are neglected