అమరావతిముచ్చట్లు:
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో భాగంగా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించినట్లు డీఎస్సీ కన్వీనర్ ఎం. వి. కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 5న 2,721 ఉపాధ్యాయ పోస్టులకు విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించి బుధవారం నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉంచినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులందరూ పూర్తి వివరాలతో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బుధవారం 397 మంది అభ్యర్థులు 487 పేపర్లకు దరఖాస్తు చేశారని వెల్లడించారు. పరీక్షకు సంబంధించిన జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వంటి వివరాల సమాచారం పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Tags: Acceptance of applications for DSC has begun