March 30, 2026
Explore
ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా..

ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును ఢీకొట్టిన ఇన్నోవా..

March 30, 2026 | Andhra Pradesh

చిలకలూరిపేట ముచ్చట్లు:


మండల పరిధిలోని పసుమర్తిసమీపంలో నూతన జాతీయ రహదారిపై సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది.ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సును ఒక ఇన్నోవా వాహనం బలంగా ఢీకొట్టింది.కళాశాల బస్సు ఎప్పటిలాగే ఇంకొల్లు నుండి నరసరావుపేట వైపు విద్యార్థులతో వెళ్తుండగా,పసుమర్తి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొట్టింది.ప్రమాద సమయంలో బస్సులో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నట్లుసమాచారం.

ఈ ప్రమాదంలో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని కళాశాలయాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది.ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన కాలేజీయాజమాన్యం,ఘటనా స్థలానికి మరో బస్సును పంపించి విద్యార్థులను సురక్షితంగా కళాశాలకు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Tags; Innova crashes into engineering college bus.