అమరావతిముచ్చట్లు:
ముఖ్యమంత్రి సహాయ నిధికి కృష్ణా డిస్ట్రిక్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ తరపున రూ.1 కోటి విరాళాన్ని ఆ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులుతో పాటు సీఎంను కలిసి చెక్కును అందించారు. తుఫాన్‌లతో పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు కేడీసీసీ బ్యాంక్ కామన్ గుడ్ ఫండ్ నుంచి ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు రఘురామ్ తెలిపారు. రైతులకు అండగా నిలిచేలా సీఎం సహాయ నిధికి విరాళం అందించినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
Tags: Rs. 1 crore donation to the Chief Minister’s Relief Fund