ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు….రోజు బాగా వర్క్ చేసే ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలిన సంఘటన…ఇంట్లో ఉన్నట్టుండి పేలిన ఫ్రిజ్.. తృటిలో ప్రాణాలు దక్కించుకున్న ఫ్యామిలీ!
హైదరాబాద్‌ముచ్చట్లు:
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న బైరాగిగూడలో మంగళవారం ఒక ఇంట్లో ఒక్కసారిగా రెఫ్రిజిరేటర్ పేలిపోయింది.
ఈ ప్రమాదంలో ఇంట్లోని విలువైన ఫర్నిచర్, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే ఈ ఘటన జరగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు
కానీ వెంటనే అప్రమత్తమై బయటకు రావడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
షార్ట్ సర్క్యూట్ లేదా కంప్రెషర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్లే ఈ పేలుడు సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Tags: A family narrowly escapes with their lives!