November 10, 2026
Explore
111 మంది మాస్టర్ ట్రైనర్లకు పంచాయతీ ఎన్నికల శిక్షణ

111 మంది మాస్టర్ ట్రైనర్లకు పంచాయతీ ఎన్నికల శిక్షణ

November 10, 2026 | Andhra Pradesh

మదనపల్లిముచ్చట్లు:

మదనపల్లిలో మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై 111 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జడ్పీ సీఈవో లక్ష్మీపతి, డీపీవో రాధమ్మ, అమర్నాథ్ రెడ్డి హాజరై ఎన్నికల నిబంధనలు, పోలింగ్ విధానం, బ్యాలెట్ పత్రాల వినియోగం, ఓటర్ల గుర్తింపు, ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు మాస్టర్ ట్రైనర్ల పాత్ర కీలకమని సూచించారు.

Tags: Training for 111 Master Trainers for Panchayat Elections