అమరావతిముచ్చట్లు:
హిందూ పంచాంగంలో ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది. మాఘంలో సూర్యుడు, శ్రావణంలో లక్ష్మీదేవి, ఆశ్వయుజంలో దుర్గాదేవిని కొలిచినట్లే.. కార్తీక మాసంలో శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దీపావళి అమావాస్యతో ఆశ్వయుజ మాసం ముగిసిన అనంతరం కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ ఈరోజు (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్న ఈ పవిత్ర కార్తీక మాసం, డిసెంబర్ 8వ తేదీ మంగళవారంతో ముగియనుంది.
కార్తీకమాసం మొదటి రోజు.. పూజా విధానం
ఇవాళ కార్తీక శుక్ల ప్రతిపద. ఈ సందర్భంగా నేడు గోవర్ధన పూజను జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు ఇంద్రుని గర్వం అణచి గోవర్ధన పర్వతం ఎత్తిన రోజు ఇది. పర్యావరణ పరిరక్షణకు, గోమాతకు కృతజ్ఞతగా ఆవు పేడతో పర్వత ఆకారాన్ని చేసి పూజిస్తారు. ఉదయం 8:46 లోపు అమృత ఘడియల్లో పూజ ఉత్తమం. పూజలో నల్లటి వస్త్రాలు ధరించకూడదు, ఆరుబయట మాత్రమే నిర్మించాలి, సవ్యదిశలో 7 ప్రదక్షిణలు తప్పనిసరి.
Tags;The month of Kartika begins today.