November 10, 2026
Explore
నేటి నుంచి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ క్యాంప్ కోర్టులు

నేటి నుంచి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ క్యాంప్ కోర్టులు

November 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ మంగళవారం నుంచి క్యాంప్ కోర్టులు నిర్వహించనుంది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో క్యాంప్ కోర్టులు జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి 13 వరకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో క్యాంప్ కోర్టులు నిర్వహించనున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల కేసులు విచారణ, కొత్త కేసులు స్వీకరించనున్నారు.

Tags; State Human Rights Commission camp courts begin today