న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
కేసులో అరెస్టయిన ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే డీమ్డ్ సస్పెన్షన్లో ఉన్నట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం తేల్చింది. లంచం కేసులో అరెస్టయిన బిహార్ ఆసుపత్రి మేనేజర్ విశ్వజిత్ సింగ్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను పునరుద్ధరించింది.
Tags: Automatic suspension if held in custody for more than 48 hours!