November 10, 2026
Explore
వాయు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యం

వాయు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యం

November 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వాయు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఏపీ రాష్ట్రంలోనే మొదటిసారి గుంటూరులో ఆల్గే ట్రీ ఏర్పాటు చేశారు. స్థానిక గాంధీ పార్క్‌లో ఏర్పాటు చేసిన

ఈ ఆల్గే ట్రీ.. 25 చెట్లకు సమానమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని నగర కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ వివరించారు.

‘ఇది సహజమైన చెట్టు కాదు. మైక్రో ఆల్గేతో నింపిన 600 లీటర్ల వాటర్‌ ట్యాంక్‌. తొలుత ఈ ట్యాంక్‌లో ఏర్పాటు చేసిన ఫ్యాన్‌లు సౌరశక్తి సాయంతో చుట్టుపక్కల ఉన్న గాలిని లోపలికి తీసుకుంటాయి. ఆ గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఆల్గే శోషించుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఇస్తుంది. పంప్‌లు, సెన్సర్లు, ఎల్‌ఈడీ లైట్ల సాయంతో చెట్టులో కంటే చాలా వేగంగా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది’ అని వివరించారు. రూ.5 లక్షలతో లలిత ఆసుపత్రి వారు సీఎస్‌ఆర్‌ కింద ఈ ఆల్గే చెట్టును ఏర్పాటు చేశారని కమిషనర్‌ తెలిపారు.

Tags: The goal is to reduce air pollution.