▪️కుటుంబ పెద్ద మరణిస్తే రూ.20వేల ఆర్థిక సాయం
అమరావతిముచ్చట్లు:
కుటుంబంలో సంపాదించే ప్రధాన వ్యక్తి(పెద్ద) మరణించినప్పుడు జాతీయ కుటుంబ లబ్ధి పథకం ద్వారా ఆ నిరుపేద కుటుంబానికి సామాజిక భద్రత కింద రూ.20 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం కుటుంబ పెద్ద 18ఏళ్ల నుంచి 60ఏళ్లలోపు చనిపోయి ఉండాలి. ఈ పథకం దరఖాస్తులను ఆర్డీఓ కార్యాలయాల్లో స్వీకరిస్తారు.
Tags;Revival of the National Family Benefit Scheme