విజయనగరం ముచ్చట్లు:
- విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్
జిల్లాలో పంచాయతీ ఎన్నికలను, రాజాం మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సిద్ధంగా కావాలని, అందుకు తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ నవంబరు 9న ఆదేశించారు.
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ –
- జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్.ఈ.సి. షెడ్యూల్ విడుదల చేసినందున, అందుకు తగినవిధంగా సంబంధిత డీఎస్పీలు భద్రత, బందోబస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
- రాజాం మున్సిపల్ ఎన్నికలు కూడా త్వరలో నిర్వహించాల్సి ఉందని, అందుకు తగిన విధంగా భద్రత చర్యలు చేపట్టాలన్నారు.
- పోలీసు అధికారులు, సిబ్బంది తమ పరిధిలోగల గ్రామాలను సందర్శించి, ఎన్నికల నిర్వహణలో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
- గ్రామాల్లో అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి, మంచి ప్రవర్తన కోసం ఎం.ఈ.ఎం. కోర్టుల్లో బైండోవరు చేయాలని, వారి వద్ద నుండి స్వంత పూచీకత్తుగా రూ. 2 – 3 లక్షలకు వరకు బాండ్లను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
- ఇప్పటికే రౌడీషీట్లు కలిగిన వారిని బైండోవరు చేయడంతోపాటు, తరుచూ గంజాయి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను, శాంతిభద్రతల సమస్యలకు కారణం అవుతున్న 20మందిని గుర్తించి, వారిపై పి.డి.యాక్ట్ నమోదు చేసి, సం. వరకు బెయిల్ రాకుండా చర్యలు చేపట్టామన్నారు.
- రాజాం మున్సిపల్ ఎన్నికలను త్వరలో నిర్వహించాల్సి ఉన్నందున క్షేత్ర స్థాయిలో వార్డులను సందర్శించాలని, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు భద్రత చర్యలు చేపట్టాలని రాజాం సిఐని ఆదేశించారు.
- పోలింగ్ కేంద్రాల వద్ద కాంపౌండ్ వాల్ ఉండే విధంగా చూడాలని, కాంపౌండ్ లేకుంటే బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు.
- పోలింగ్ జరిగిన కేంద్రంలోనే ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నందున అధికారులు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
- పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సూచనలు చేసేందుకు పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్స్, బెల్ హెల్లర్ ఏర్పాటు చేయాలన్నారు.
- జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను, రాజాం మున్సిపల్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను తెలుసుకొని, ఇంకనూ వారు తీసుకోవాల్సిన భద్రత చర్యలపై జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ దిశా నిర్దేశం చేశారు.
Tags:Preparations should be made for conducting the panchayat elections peacefully.