November 9, 2026
Explore
ఏపీలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల గుర్తులు ఖరారు

ఏపీలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల గుర్తులు ఖరారు

November 9, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. సర్పంచ్ అభ్యర్థులకు 25, వార్డు సభ్యులకు 20 ఎన్నికల గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది. పోటీదారుల సంఖ్య పెరిగితే మరిన్ని గుర్తులు అందిస్తామని అధికారులు వెల్లడించారు. ఓటర్లకు నోటా సదుపాయం కల్పించారు. ఈ నెల 26, 29, డిసెంబర్ 3 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

📢 సర్పంచ్ & వార్డు సభ్యులకు గుర్తులు

👉 సర్పంచి అభ్యర్థులకు.. మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పూ సాసరు, క్యారెట్, తాళంచెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా గుర్తులు కేటాయించనున్నారు.

👉 వార్డు సభ్యులకు.. ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్, బీరువా, ఐస్ క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు ఇవ్వనున్నారు.

Tags; Symbols for the upcoming Panchayat elections in AP have been finalized