చిన్నమండంముచ్చట్లు:
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన స్వగృహంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. సమస్యలను సావధానంగా విన్న మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
Tags;Minister’s ‘Praja Darbar’ (Public Grievance Hearing) on issues faced by the public