అమరావతిముచ్చట్లు:
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…
• గుడ్ గవర్నెన్సు లీడ్స్ టు గుడ్ పాలిటిక్స్ అని నేను నిరంతరం విశ్వసిస్తాను.
• స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు అఖండ విజయాన్ని అందించారు.
• 2024 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు మరింతగా ప్రజల ఆదరణ లభించింది.
• గతంతో పోలిస్తే వైసీపీని మరింతగా ప్రజలు తిరస్కరించారు.
• కూటమి ఘన విజయంతోనే ప్రజా స్పందన ఎలా ఉందో దీనిని బట్టి తెలిసిపోతోంది.
• పట్టణ స్థానిక సంస్థలైనా, పరిషత్ ఎన్నికలైనా ప్రజల మద్దతు కూటమికే ఇచ్చారు.
• అన్ని జిల్లాల్లోనూ కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపారు.
• అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పలనాడు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో అసలు వైసీపీకి ప్రజా మద్దతే రాలేదు.
• ఈవీఎంలు అయినా, బ్యాలెట్ అయినా, పోస్టల్ బ్యాలట్ అయినా కూటమి వైపే ప్రజల మద్దతు ఉంది.
• ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్వచ్చంధంగా ఓట్లు వేసి కూటమి అభ్యర్ధులను గెలిపించారు.
• కూటమి అభ్యర్ధులను గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
• ఎన్నికలు వచ్చినా తుఫాన్లలో ప్రజల కష్టాల వైపే మొగ్గు చూపి కష్టించి పనిచేసాం. దీనిని ప్రజలు గమనించారు.
• రెండున్నర ఏళ్లలో అభివృద్ధికి దక్కిన ఆమోదం ఇది. సుపరిపాలనకు దక్కిన గౌరవం ఇది.
• వర్గాలు, పట్టణాలు, పల్లెలు ఇలా ఎక్కడైనా ప్రజల ఆలోచనా విధానం ఒకేలా ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
• రెండున్నర ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి, సుపరిపాలన కోసం పనిచేశాతం, అందుకే ప్రజలు ఆశీర్వదించారు.
Tags;Chief Minister Chandrababu holds a press conference on the alliance’s resounding victory in the local body elections