పుంగనూరుముచ్చట్లు:
దీపావళి , నోముల పండుగను ప్రజలు ఆది, సోమవారాలలో అత్యంత భక్తిశ్రద్దలతో ఆడ, మగ తేడా లేకుండ ప్రజలు నిర్వహించేందుకు సిద్దమౌతున్నారు. పట్టణంలోని మిని బైపాస్‌రోడ్డులో టపాకాయల దుకాణాలు, ఎంబిటి రోడ్డులో నోముదారాలు, లక్ష్మీకాసులు వెండి, బంగారుతో చేసిన వస్తువుల విక్రయాలు ఊపందుకున్నాయి. పండుగ సందర్భంగా ఇండ్లను, వ్యాపార కేంద్రాలు, ఫ్యాక్టరీలు, వాహనాలకు విశేషంగా పూజలు చేయడం ఆనవాయితీ. వీటికి అవసరమైన మామిడి ఆకు, ఆరటి మొక్కలు, పూలు, టెంకాయలు, నోముముడులు రోడ్లపై వ్యాపారులు పెట్టి విక్రయాలు చేపట్టారు. ప్రతి ఏటా దీపావళి పండుగ రోజు మహాలక్ష్మికి నోము దారాలు కట్టి కుటుంబ సభ్యులందరు నూతన వలు ధరించి, నిష్ట, ఉపవాస దీక్షలతో ఉదయం నుంచి మహాలక్ష్మీదేవి పూజలు నిర్వహిస్తారు. ప్రజలు తమ శక్తిమేరకు బంగారు, వెండితో తయారు చేసిన నోముదారాలను కుడిచేతికి కట్టుకోవడం సాంప్రదాయం. అలాగే చక్కర , బెల్లం, బియ్యపు పిండితో రుచిగా చేసి అతి రసాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో వింధుభోజనాలు చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి వెహోక్కులు చెల్లిస్తారు. పుంగనూరు ప్రధాన పట్టణం కావడంతో వేలాది మంది తమకు కావాల్సిన వస్తువుల కొనుగోలు కోసం పట్టణం చేరుకోవడంతో పట్టణం క్రిక్కిరిసింది.

Tags: Everything is set for Diwali and Nomula Panduga on the 8th