November 7, 2026
Explore
అరాచకాలలో పోరాడి గెలిచిన ఎంపిటిసిలు

అరాచకాలలో పోరాడి గెలిచిన ఎంపిటిసిలు

November 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వైఎస్సార్‌సిపి అభ్యర్థులను ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండ అధికార పార్టీ వారు, అధికారులు , పోలీసులు ఒక్కటై ఎదుర్కొన్నారు. పలు అరాచకాలకు, విధ్వంషాలకు పాల్పడి, నామినేషన్‌ పత్రాలు లాకెళ్ళారు. ఈ దాడుల్లో పలువురు వైఎస్సార్‌సిపి అభ్యర్థులు గాయపడ్డారు. ఇన్ని సంఘటనలు జరిగిన మండల ఎంపిటిసిలుగా ఐదు మంది వైఎస్సార్‌సిపి అభ్యర్థులు గెలుపొందడంతో ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మండలంలోని నెక్కుంది ఎంపిటిసి అభ్యర్థి సి.హేమావతి 576 ఓట్ల మెజార్టీతో టీడిపి అభ్యర్థిని ఓడించారు. అలాగే చండ్రమాకులపల్లె ఎంపిటిసి అభ్యర్థి ఏ.నారాయణస్వామి 105 ఓట్ల మెజార్టీతో టిడిపిని ఓడించాడు. ఏతూరు ఎంపిటిసి అభ్యర్థి సి.విజయలక్ష్మీ 450 ఓట్లతో టిడిపిని ఓడించాడు. నేతిగుట్లపల్లె ఎంపిటిసి అభ్యర్థి నాగరాజనాయక్‌ 41 ఓట్లతో టిడిపి అభ్యర్థిని ఓడించాడు. కాగా నాగరాజనాయక్‌ 230 ఓట్లతో మధ్యాహ్నం గెలుపొందినట్లు తెలిసిన , రీకౌంటింగ్‌ల పేరుతో కాలయాపన చేస్తూ, ఎన్నికల అధికారులు చివరకు గత్యంతరం లేక 41 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సిపి అభ్యర్థులు గెలుపొందడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:MPTCs who triumphed despite facing atrocities